సింగరేణి గని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మిక కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల సైతం.. సింగరేణి బొగ్గు గని ప్రమాదం పట్ల హుజూరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని […]

Update: 2021-11-10 11:12 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మిక కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల సైతం..

సింగరేణి బొగ్గు గని ప్రమాదం పట్ల హుజూరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు.
మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News