త్వరలో మానుకోటకు సీఎం కేసీఆర్..
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మానుకోటలో 48 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన 300 పడకల మెడికల్ కాలేజ్‌కు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురువారం మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, జడ్పీ చైర్మన్ బిందు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లతో కలిసి నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం, మెడికల్ కాలేజ్ […]
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మానుకోటలో 48 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన 300 పడకల మెడికల్ కాలేజ్‌కు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురువారం మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, జడ్పీ చైర్మన్ బిందు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లతో కలిసి నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం, మెడికల్ కాలేజ్ నిర్మించే స్థలాన్ని సందర్శించారు.
కరోనా కారణంగా కూలీలు రాకపోవడంతో ఇప్పటికే కొంత అలస్యం జరిగిందని, ఇక మీదట పనుల జాప్యం జరగకుండా అధిక సంఖ్యలో కూలీలను ఏర్పాటు చేసి త్వరితగతిన భవనాలు పూర్తి చేసి ఇవ్వాలన్నారు. కలెక్టర్ కార్యాలయ భవనం ప్రారంభం, వైద్య కళాశాల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని మంత్రి వివరించారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత కంపల్సరీ అని స్పష్టంచేశారు. నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కొమరయ్య పాల్గొన్నారు.