ప్రెస్‌మీట్‌లో అవి చూసి షాకైన మంత్రి సబిత (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : గత రెండేళ్లలో వందలాది యూట్యూబ్ చానెళ్లు పుట్టుకొచ్చాయి. జర్నలిజంపై కాసింత అవగాహన ఉన్న వాళ్లందరూ యూట్యూబ్ చానెల్ లేదా ఈ-పేపర్ పెట్టేస్తున్నారు. కరోనా తర్వాత చాలా మంది జర్నలిస్టులకు ఉద్యోగాలు పోయాయి. వారందరూ సొంతంగా టీవీ చానళ్లను నెలకొల్పుకొన్నారు. సెల్ ఫోన్లనే కెమెరాలుగా మలుచుకుని లోగోలతో హంగామా చేస్తున్నారు. అయితే శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాద్ నగర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి 50కి పైగా చానెళ్లు హాజరయ్యాయంటే అతిశయోక్తి […]
దిశ, వెబ్‌డెస్క్ : గత రెండేళ్లలో వందలాది యూట్యూబ్ చానెళ్లు పుట్టుకొచ్చాయి. జర్నలిజంపై కాసింత అవగాహన ఉన్న వాళ్లందరూ యూట్యూబ్ చానెల్ లేదా ఈ-పేపర్ పెట్టేస్తున్నారు. కరోనా తర్వాత చాలా మంది జర్నలిస్టులకు ఉద్యోగాలు పోయాయి. వారందరూ సొంతంగా టీవీ చానళ్లను నెలకొల్పుకొన్నారు. సెల్ ఫోన్లనే కెమెరాలుగా మలుచుకుని లోగోలతో హంగామా చేస్తున్నారు. అయితే శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాద్ నగర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి 50కి పైగా చానెళ్లు హాజరయ్యాయంటే అతిశయోక్తి కాదు. మొయిన్ ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు చిన్నాచితక యూట్యూబ్ చానెళ్ల వాళ్లు ప్రెస్ మీట్‌కు వెళ్లారు. టేబుల్‌పై ఉన్న లోగోలను చూసి మంత్రి సబితా అవాక్కయ్యారు. అమ్మో.. ఇన్ని చానెళ్ల అంటూ ఆమె గుండెలు బాదుకున్నారు.