మంత్రి పువ్వాడ హామీ అటకెక్కినట్టేనా..?

దిశ, ఇల్లందు : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. నేటికీ ఆ హామీ అమలు కాకపోవడం శోచనీయమని ఇల్లందులో పలువురు బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. ఇల్లందులో ఫిబ్రవరి 10న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.3 కోట్ల ఇరవై ఐదు లక్షలతో మినీ బస్ డిపో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆనాడు జరిగిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ దసరా పండుగ నాటికి సాటిలైట్ […]

Update: 2021-10-12 11:07 GMT

దిశ, ఇల్లందు : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. నేటికీ ఆ హామీ అమలు కాకపోవడం శోచనీయమని ఇల్లందులో పలువురు బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. ఇల్లందులో ఫిబ్రవరి 10న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.3 కోట్ల ఇరవై ఐదు లక్షలతో మినీ బస్ డిపో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆనాడు జరిగిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ దసరా పండుగ నాటికి సాటిలైట్ మినీ బస్ డిపోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దసరా పండుగ రానే వచ్చింది.

కానీ, మంత్రి హామీ మాత్రం నెరవేరలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.హామీలు అమలు కాకపోవడం పట్ల పలువురు బాహాటంగా మండిపడుతున్నారు. ఇల్లందు నుండి దూరప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇక్కడ బస్ డిపో వస్తే సౌకర్యాలు పెరుగుతాయని ఆనందం వ్యక్తం చేశారు. కానీ, వారి ఆశలు అడియాశలయ్యాయి. అదే తరహాలో రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీ కూడా నీరు గారడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News