కంటైన్‌మెంట్ జోన్లలో నిఘా పెంచండి : మంత్రి పువ్వాడ అజ‌య్

దిశ‌, ఖ‌మ్మం: కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచి నిఘాను కట్టుదిట్టం చేయాలని అధికారుల‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఖమ్మం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరడంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలైన నాయకన్ గూడెం, నేలకొండపల్లి మండలం పైనంపల్లి చెక్ పోస్ట్‌ను మంత్రి తనిఖీ చేశారు. ఈ క్రమంలో అధికారులు న‌మోదు చేస్తున్న రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. అనంతరం కలెక్టర్ కర్ణన్, పోలీస్ […]

Update: 2020-04-22 10:18 GMT

దిశ‌, ఖ‌మ్మం: కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచి నిఘాను కట్టుదిట్టం చేయాలని అధికారుల‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఖమ్మం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరడంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలైన నాయకన్ గూడెం, నేలకొండపల్లి మండలం పైనంపల్లి చెక్ పోస్ట్‌ను మంత్రి తనిఖీ చేశారు. ఈ క్రమంలో అధికారులు న‌మోదు చేస్తున్న రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. అనంతరం కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ త‌ఫ్సీర్ ఇక్బాల్‌కు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి అజయ్ కుమార్ పలు సూచనలు చేశారు. చివరగా జిల్లా వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టుల వద్ద అధికారులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

Tags: corona, lockdown, positive areas, security tight, minister puvvada ajay kumar

Tags:    

Similar News