పండిన ప్రతి ధాన్యపు గింజను కొంటాం: మంత్రి పువ్వాడ
దిశ, ఖమ్మం: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా రైతులు […]
దిశ, ఖమ్మం: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా రైతులు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. అనంతరం భద్రాద్రి జిల్లాను కరోనా రహితంగా చేసినందుకు కలెక్టర్ ఎంవీరెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ , అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , ఆర్డీవో, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Tags: Minister Puvvada Ajay kumar, crop purchase center, inaugurated