కేంద్ర ప్రభుత్వానిది అసత్య ప్రచారం.. ధాన్యం కొనుగోళ్లపై పువ్వాడ ఫైర్

దిశ, ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం సాయంత్రం నగరం‌లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర మంత్రులకు సమయం ఇవ్వని బీజేపీ పెద్దలు నీతులు చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బండి సంజయ్‌ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ మాట తప్పినందుకే దీక్ష చేస్తున్నారా? అని […]

Update: 2021-12-25 08:36 GMT

దిశ, ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం సాయంత్రం నగరం‌లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర మంత్రులకు సమయం ఇవ్వని బీజేపీ పెద్దలు నీతులు చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బండి సంజయ్‌ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ మాట తప్పినందుకే దీక్ష చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నామనే సహనంతో ఉన్నామని చెప్పారు.

 

Tags:    

Similar News