సైకిల్‌పై పర్యటించిన ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్
దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్‌లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం మేయర్ పునుకొల్లు నీరజ , జిల్లా కలెక్టర్ వి. పి గౌతమ్ మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్‌లతో కలిసి సైకిల్‌పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. నగరంలోని పలు వీధులు తిరిగి స్థానిక నివాసాల ప్రజలతో మాట్లాడారు. మిషన్ భగీరథ, రోడ్లు, వీధి దీపాలు, పైప్ లైన్ పనులు, రోడ్డు […]
దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్‌లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం మేయర్ పునుకొల్లు నీరజ , జిల్లా కలెక్టర్ వి. పి గౌతమ్ మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్‌లతో కలిసి సైకిల్‌పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. నగరంలోని పలు వీధులు తిరిగి స్థానిక నివాసాల ప్రజలతో మాట్లాడారు. మిషన్ భగీరథ, రోడ్లు, వీధి దీపాలు, పైప్ లైన్ పనులు, రోడ్డు విస్తరణ పనులు, కాల్వలు తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్, కాస్బా బజార్, పాకబండ బజార్, బోనకల్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్, మార్కెట్ రోడ్, సుందరయ్య నగర్, పంపింగ్ వెల్ రోడ్, గాంధీ చౌక్, ట్రంక్ రోడ్, మయూరి సెంటర్, పాత బస్టాండ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రాడ్, ఆర్డీఓ కార్యాలయం, వైరా రోడ్, జడ్పీ సెంటర్, కాలెక్టరేట్, ఇల్లందు సర్కిల్, ఐటి హబ్ సెంటర్, వైరా రోడ్, మమత సర్కిల్, వరదయ్య నగర్, లకారం సర్కిల్ నందు పర్యటించారు.
అనంతరం లకారం ట్యాంక్ బండ్ నందు మొక్కలు నాటారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని పనుల సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లేని పక్షంలో తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్,డైరెక్టర్ ముక్తర్, తదితరులు పాల్గొన్నారు