సహకార సంఘాలపై ప్రతివారం సమీక్ష

దిశ, న్యూస్‌బ్యూరో: సహకారం సంఘాల్లో ప్రతివారం సమీక్ష నిర్వహించి ఆర్థిక ప్రగతి, లావాదేవీలపై నివేదికలు రూపొందించుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థ పనితీరుపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపెక్స్ బ్యాంకు ప్రెసిడెంట్ కొండూరి రవీందర్‌రావు అధ్యక్షతన జాతీయ సహకార బ్యాంకు సమాఖ్య ఏర్పాటు చేసిన కమిటీ నివేదికల సిఫార్సుల అమలుకు సూత్రప్రాయంగా మంత్రి అంగీకారం తెలిపారు. అనంతరం మంత్రి పలు సూచనలు చేశారు. పీఏసీఎస్‌లో కంప్యూటరీకరణ పురోగతిపై హర్షం […]

Update: 2020-06-23 10:26 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: సహకారం సంఘాల్లో ప్రతివారం సమీక్ష నిర్వహించి ఆర్థిక ప్రగతి, లావాదేవీలపై నివేదికలు రూపొందించుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థ పనితీరుపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపెక్స్ బ్యాంకు ప్రెసిడెంట్ కొండూరి రవీందర్‌రావు అధ్యక్షతన జాతీయ సహకార బ్యాంకు సమాఖ్య ఏర్పాటు చేసిన కమిటీ నివేదికల సిఫార్సుల అమలుకు సూత్రప్రాయంగా మంత్రి అంగీకారం తెలిపారు. అనంతరం మంత్రి పలు సూచనలు చేశారు. పీఏసీఎస్‌లో కంప్యూటరీకరణ పురోగతిపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మొదటిసారిగా సహకార సంఘాల్లో కంప్యూటరీకరణ చేపట్టామని, దీనిలో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ఇకపై సంఘాల్లో లావాదేవీలన్నీ కంప్యూటర్ ద్వారానే నిర్వహించాలని, ఈ ప్రక్రియను డీసీసీబీల సీఈవోలు పర్యవేక్షించాలన్నారు. 30రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి సంఘం ఆర్థిక పరిస్థితి, పనితీరుపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జనార్థన్‌రెడ్డి, సహకార సంఘాల కమిషనర్ వీరబ్రహ్మయ్య పాల్గొన్నారు.

Tags:    

Similar News