Covid Centers: సీఎం ఆదేశాలు.. కొవిడ్ సెంటర్‌లో మంత్రులు

దిశ, గద్వాల: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా బాధితులు, రోగులకు అందిస్తున్న చికిత్సపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని కొవిడ్ సెంటర్‌లను ఏర్పాటు చేసి నిరంతరం సమీక్ష చేస్తున్నామని తెలిపారు. వైద్య సిబ్బంది మానవత్వంతో పనిచేస్తూ.. కుటుంబాలను వదిలి పేషెంట్లకు చికిత్స చేయడాన్ని ఆయన ప్రశంసించారు. […]

Update: 2021-05-24 04:33 GMT

దిశ, గద్వాల: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా బాధితులు, రోగులకు అందిస్తున్న చికిత్సపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని కొవిడ్ సెంటర్‌లను ఏర్పాటు చేసి నిరంతరం సమీక్ష చేస్తున్నామని తెలిపారు. వైద్య సిబ్బంది మానవత్వంతో పనిచేస్తూ.. కుటుంబాలను వదిలి పేషెంట్లకు చికిత్స చేయడాన్ని ఆయన ప్రశంసించారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారని, ఇదే విధంగా భౌతిక దూరం, మాస్క్‌లు ధరిస్తే తొందరలోనే ఈ విపత్తు నుంచి బయట పడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆహార ప్యాకెట్‌లను మంత్రి చేతుల మీదుగా ఆసుపత్రిలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణి, జడ్పీ చైర్ పర్సన్ సరితా, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యే‌లు కృష్ణ మోహన్ రెడ్డి, అబ్రహంలు, స్థానిక మున్సిపల్ చైర్మన్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News