రైతు రాజు కావాలన్నదే సీఎం ఉద్దేశ్యం: నిరంజన్ రెడ్డి
దిశ,వెబ్ డెస్క్: రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశ్యమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రుల నివాస సముదాయంలో టీఎస్ ఆగ్రోస్ సంస్థ మండలి భేటిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…సిరి ఎరువుల మార్కెటింగ్, రైతు బజార్లు,ఏఎంసీ వ్యర్థాలతో విద్యుత్ తయారీ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. పండ్లు, కూరగాయల మార్కెట్ల వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీలో జరుగుతున్న విద్యుదుత్పత్తి కేంద్రాలను మహేంద్ర […]
దిశ,వెబ్ డెస్క్: రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశ్యమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రుల నివాస సముదాయంలో టీఎస్ ఆగ్రోస్ సంస్థ మండలి భేటిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…సిరి ఎరువుల మార్కెటింగ్, రైతు బజార్లు,ఏఎంసీ వ్యర్థాలతో విద్యుత్ తయారీ అంశాలపై చర్చించినట్టు తెలిపారు.
పండ్లు, కూరగాయల మార్కెట్ల వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీలో జరుగుతున్న విద్యుదుత్పత్తి కేంద్రాలను మహేంద్ర సంస్థ సహాయంతో సందర్శించి అధ్యయం చేస్తామని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఏపీలోని తిరుపతి, పిడుగురాళ్ల, ఆదోనిలోని యూనిట్లను కమిటీ సందర్శిస్తుందని చెప్పారు. కమిటీ నివేదిక అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.