బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్..
కోల్‌కతా : మమతా బెనర్జీ సర్కారుకు మరో షాక్ తగిలింది. దీదీ క్యాబినెట్ నుంచి వైదొలుగుతున్నట్టు మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా ప్రకటించారు. రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. టీఎంసీ హౌరా జిల్లా అధ్యక్షుడిగానూ రిజైన్ చేశారు. ఆయన రాజీనామాకు ఆమోదం లభించినట్టు రాష్ట్ర సచివాలయ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవికి రాజీనామా చేసినా అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేయలేదు. […]
కోల్‌కతా : మమతా బెనర్జీ సర్కారుకు మరో షాక్ తగిలింది. దీదీ క్యాబినెట్ నుంచి వైదొలుగుతున్నట్టు మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా ప్రకటించారు. రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. టీఎంసీ హౌరా జిల్లా అధ్యక్షుడిగానూ రిజైన్ చేశారు. ఆయన రాజీనామాకు ఆమోదం లభించినట్టు రాష్ట్ర సచివాలయ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవికి రాజీనామా చేసినా అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేయలేదు.
ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగనున్నారు. హౌరా జిల్లా నుంచి టీఎంసీ సీనియర్ నేతలతో ఆయనకు పొసగడం లేదని, కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు శుక్లా సన్నిహితవర్గాలు తెలిపాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీఎంసీలో రెబల్స్ పెరుగుతున్నారు. సీనియర్ నేత శివేందు అధికారి కూడా మంత్రి పదవికి, అటుతర్వాత పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన సోదరుడు 15 మంది కౌన్సిలర్లతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా శుక్లా కూడా రాజీనామా చేశారు. అయితే, రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.