రంగంలోకి దిగిన కేటీఆర్.. రెబల్స్‌ను తప్పించేందుకు రహస్య మంతనాలు..!
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమీకరణాలు జరిపేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. రెబల్స్‌ను పోటీ నుండి తప్పించేందుకు వారితో చర్చలు జరుపుతున్నారు. ఏకగ్రీవంగా రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో పార్టీ నాయకులు అదే పనిలో నిమగ్నం అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా రెబల్స్‌తో ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం సనుగుల ఎంపీటీసీ మాదాసు వేణు బృందంతో కేటీఆర్ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమీకరణాలు జరిపేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. రెబల్స్‌ను పోటీ నుండి తప్పించేందుకు వారితో చర్చలు జరుపుతున్నారు. ఏకగ్రీవంగా రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో పార్టీ నాయకులు అదే పనిలో నిమగ్నం అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా రెబల్స్‌తో ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతున్నారు.
హైదరాబాద్‌లో వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం సనుగుల ఎంపీటీసీ మాదాసు వేణు బృందంతో కేటీఆర్ చర్చలు జరిపారు. సుమారు 50 నిమిషాల పాటు వీరితో సమావేశం అయిన కేటీఆర్ వారి సాదక బాధకాలు అన్ని విన్నారు. వాటన్నింటినీ పరిష్కరించడంతో పాటు పార్టీలో సముచిత ప్రాధాన్యత ఉంటుందన్న హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. మాదాసు వేణు మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మాదాసు వేణు పోటీ నుండి తప్పుకుంటానని మాట ఇచ్చారని కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.
అలాంటిదేమీ లేదు..
అయితే మాదాసు వేణు వర్గం మాత్రం తాము ఎదుర్కొన్న ఇబ్బందులు వివరించాం తప్పా పోటీ నుండి నిష్క్రమిస్తామని మాత్రం చెప్పలేదని చెప్తున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో విత్ డ్రా చేసుకోమంటున్నారు. తమకు రావాల్సిన బిల్లుల విషయంతో పాటు పార్టీలో తగ్గిన ప్రాధాన్యం గురించి మాత్రమే వివరించామని వెల్లడిస్తున్నారు.
గంగుల మంత్రాంగం…
మిగతా రెబల్స్ విషయంలో కూడా జిల్లా మంత్రులు మంత్రాంగాలు నడిపిస్తున్నారు. పోటీలో ఉన్న వారందరినీ విరమించేందుకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు చర్చలు జరుపుతున్నారు. వీలైనంత మందిని పోటీ నుండి తప్పించాలని భావిస్తున్నారు. దీనివల్ల పార్టీ ఓట్లు చీలిపోవని టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఏది ఏమైనా ఏకగ్రీవం తప్పని పరిస్థితుల్లో అయితే ద్విముఖ పోరుకే ప్రయత్నం చేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.