గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ రివ్యూ..
దిశ, వెబ్‌డెస్క్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ శనివారం రివ్యూ నిర్వహించారు.ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, ఫిబ్రవరి నెలలో రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దాంతో పాటు నాగార్జునసాగర్ ఉపఎన్నిక మీద కూడా కేటీఆర్ సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని దృష్టిలో […]
దిశ, వెబ్‌డెస్క్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ శనివారం రివ్యూ నిర్వహించారు.ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, ఫిబ్రవరి నెలలో రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.
దాంతో పాటు నాగార్జునసాగర్ ఉపఎన్నిక మీద కూడా కేటీఆర్ సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ తహతహలాడుతోంది. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ గులాబీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.