పిచ్చోడ్ని పార్లమెంట్‌కు ఎందుకు పంపారో తెలియడం లేదు.. కేటీఆర్ ఫైర్

దిశ, సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం వరి కొంటామంటే మేము వద్దు అంటున్నామా? అని మంత్రి కేటీఆర్ తెలంగాణ బీజేపీ నేతలను ప్రశ్నించారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తోందన్నారు. ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి పెద్దపీట లభించిదని, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఏడున్నరేళ్లలో తుడిచి పెట్టగలిగామని చెప్పారు. సమైఖ్య […]

Update: 2021-11-12 05:13 GMT

దిశ, సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం వరి కొంటామంటే మేము వద్దు అంటున్నామా? అని మంత్రి కేటీఆర్ తెలంగాణ బీజేపీ నేతలను ప్రశ్నించారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తోందన్నారు. ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి పెద్దపీట లభించిదని, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఏడున్నరేళ్లలో తుడిచి పెట్టగలిగామని చెప్పారు. సమైఖ్య పాలనలో అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. ఈ ప్రపంచంలో తామే మేధావులం అని ఫోజు కొట్టే వాళ్లకు రాని ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చిందని, దాని ఫలితమే రైతుబంధు, రైతుబీమా, దళితబంధు పథకాలు అని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ పథకాలను కేంద్రం సహా దేశంలోని పదకొండు రాష్ట్రాలు కాపీ కొట్టాయన్నారు.

ఏదైనా కారణంగా రైతు చనిపోయిన పది రోజుల్లోపే బీమా కింద ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయన్నారు. నడి ఎండాకాలంలోనూ సిరిసిల్ల నియోజకవర్గంలో చెరువులు మత్తడి దూకుతున్నాయని గుర్తుచేశారు. సిరిసిల్ల పట్టణంలో బ్రిడ్జి కింద నీళ్లు ఏనాడైనా చూశామా?, కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీపడి కేసీఆర్ నిర్మించారని వివరించారు. రైతులకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ రాష్ట్రాన్ని దాటి పోయామని తెలంగాణ రైతు కాలర్ ఎగురేసి మరీ చెప్తున్నారన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా గ్రామాల బాట పట్టి వ్యవసాయం చేస్తున్నారంటే అది కేసీఆర్ రైతు పక్షపాత విధానాల ఫలితమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వమే చెప్పిందన్నారు. 3 కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణ పండించిందని, గ్లోబల్ హాంగర్ ఇండెక్స్‌లో భారత్ స్థానం 101 అని అక్టోబర్‌లో విడుదలైన ఓ నివేదిక చెబుతోందని, ఆకలి రాజ్యాల లిస్టులో భారత్ ర్యాంక్ 101 అని చెప్పడం మనకు సిగ్గుచేటు కాదా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్ల కంటే వెనుకబడి ఉన్నామంటే బీజేపీ దిక్కుమాలిన పాలనకు ఈ ర్యాంక్ అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ తొండి సంజయ్‌లాగా మారాడని, బండి సంజయ్ పాదయాత్రలో తాము నిర్మించిన రైతు వేదికల్లో పడుకున్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. బీజేపీ నాయకులు ధర్నా ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు. మోడీ ధాన్యం కొంటామంటే మేము వద్దంటున్నమా? వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉందని, రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కేటీఆర్ కుండ బద్దలు కొట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి వద్దు అంటుంటే, బండి సంజయ్‌ వరే పండించాలంటున్నాడని మండిపడ్డారు. ‘పిచ్చోడు సంజయ్‌ని ప్రజలు పార్లమెంట్‌కు ఎందుకు పంపారో అర్థం కావడం లేదు.’’ అని ఎద్దేవా చేశారు. కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచి పెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ మెడలు వంచిన తాము, బీజేపీ మెడలు వంచలేమా? అన్నారు.

అంతర్రాష్ట్ర జల వివాదాలపై త్వరగా తేల్చండి : మంత్రి హరీశ్ రావు

Tags:    

Similar News