అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
దిశ, హైదరాబాద్: గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ప్రగతి భవన్‌లో ఆరు నూతన అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరోనా బాధితుల కోసం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులెన్స్‌లను సోమవారం మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, […]
దిశ, హైదరాబాద్: గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ప్రగతి భవన్‌లో ఆరు నూతన అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరోనా బాధితుల కోసం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులెన్స్‌లను సోమవారం మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, జీవన్ రెడ్డి, సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు వైద్య సేవల నిమిత్తం రూ.1.23కోట్ల వ్యయంతో ఆరు నూతన అంబులెన్స్‌లను ప్రకటించారు. వీటిని ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ కు కేటాయించనున్నారు. ఈ అంబులెన్స్‌లను ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సమయం వృధా కాకుండా బాధితులను నిర్ణీత (గోల్డెన్ అవర్) సమయంలో ఆసుపత్రికి చేర్చుతాయాని పేర్కొన్నారు. జిల్లాకు 6 అంబులెన్స్‌లను అందించడం పట్ల మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు ఎంపీ నామాకు అభినందనలు తెలియజేశారు.