కమాండ్ కంట్రోల్ సెంటర్‎ ప్రారంభం

దిశ, వెబ్‎డెస్క్: హైద‌రాబాద్‎లోని సైబరాబాద్ కమిషనరేట్‎లో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌మ్మ‌ద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి ఏకకాలంలో ఐదువేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి […]

Update: 2020-11-11 02:20 GMT

దిశ, వెబ్‎డెస్క్: హైద‌రాబాద్‎లోని సైబరాబాద్ కమిషనరేట్‎లో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌మ్మ‌ద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కమాండ్ కంట్రోల్ నుంచి ఏకకాలంలో ఐదువేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసు మొదటి స్థానంలో ఉన్నారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడ నుంచి వీక్షించే సదుపాయం ఉంది.

Tags:    

Similar News