కరోనాపై మంత్రి కొప్పుల సమీక్ష
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా రామగుండంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి నివసించే ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ.. కరోనా నివారణకు తెలంగాణ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటేనే వ్యాధిని అరికట్టగలమని తేల్చిచెప్పారు. లాక్‌డౌన్‌కు […]
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా రామగుండంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి నివసించే ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ.. కరోనా నివారణకు తెలంగాణ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటేనే వ్యాధిని అరికట్టగలమని తేల్చిచెప్పారు. లాక్‌డౌన్‌కు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.
Tags: Peddapally,Minister,Koppula,review