కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్

దిశ, గోదావరిఖని: బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేస్తున్నదని మంత్రి కోప్పుల ఈశ్వర్ అన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థలోని కోయగూడెం, కేకే 6, సత్తుపల్లి, శ్రావనపల్లి 4 బ్లాక్ వేలాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం రామగుండం రీజియన్ 2 ఏ గని వద్ద సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్, జాతీయ సంఘాలు చేస్తున్న మూడు రోజుల కార్మికుల సమ్మెకు మంత్రి కోప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ […]

Update: 2021-12-10 08:38 GMT

దిశ, గోదావరిఖని: బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేస్తున్నదని మంత్రి కోప్పుల ఈశ్వర్ అన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థలోని కోయగూడెం, కేకే 6, సత్తుపల్లి, శ్రావనపల్లి 4 బ్లాక్ వేలాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం రామగుండం రీజియన్ 2 ఏ గని వద్ద సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్, జాతీయ సంఘాలు చేస్తున్న మూడు రోజుల కార్మికుల సమ్మెకు మంత్రి కోప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 133 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ లాభాల్లో ప్రయాణిస్తుంటే అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ సంఘాలు వ్యతిరేస్తున్నట్టు చెప్పారు.

Tags:    

Similar News