'చివరి కిరణం' అంటూ ఆయనను గుర్తుచేసిన మంత్రి

దిశ ప్రతినిధి, నల్లగొండ: వ్యవసాయ రంగంలో విపలవాత్మక మైన మార్పులతో ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను రూపొందించారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో రైతులు అధునాతన వ్యవసాయంవైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్బోధించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం, చౌటుప్పల్, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండల కేంద్రాలలో మంగళవారం ఆయన రైతువేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన చండూరులో […]

Update: 2020-07-21 03:24 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: వ్యవసాయ రంగంలో విపలవాత్మక మైన మార్పులతో ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను రూపొందించారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో రైతులు అధునాతన వ్యవసాయంవైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్బోధించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం, చౌటుప్పల్, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండల కేంద్రాలలో మంగళవారం ఆయన రైతువేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన చండూరులో మీడియాతో మాట్లాడుతూ.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు. తద్వారా పండించిన పంటకు మద్దతు ధర సాధించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా రైతాంగాన్ని ఓట్ల బ్యాంక్ లుగా చూసిన కాంగ్రెస్ వంటి పార్టీలకు రైతు బంధు, రైతు భీమాలతో పాటు రైతువేదికల నిర్మాణాలు, పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు కలలో కూడా వచ్చి ఉండేవి కావంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణా ఏర్పాటు అంటూ జరిగితే చిమ్మ చీకట్లు అలుముకుంటాయని ఉమ్మడి రాష్ట్రం చివరి కిరణం కర్ర పట్టుకుని బోధించిన నాడు ఇక్కడి కాంగ్రెస్ నేతలు అందరూ సీమాంధ్రుల మోచేతి నీళ్లు తాగిన వారేనని ఆయన గుర్తుచేశారు. ఆ చివరి కిరణమే కాదు అసలు కరెంట్ 24 గంటలు ఇవ్వొస్తుందా అన్న రీతిలో 24 గుంటల ఉచిత విద్యుత్ ను అందించిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు. రైతు వేదికల ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని….రైతులు అందరూ ఒకే వేదిక కిందకు వచ్చి తాము పండించే పంటలపై చర్చకు దిగితే అద్భుతమైన ఫలితాలు సాదించ వచ్చు అన్నారు. పొలాల వద్ద కళ్లాలు వ్యవసాయ రంగంలో సంచలనాత్మకమైనవని ఆయన వర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీ లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యుడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News