ఆప్తులతోనే అపాయం.. దాచి పెడితే మొదటికే మోసం

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆప్తులతోనే కరోనా వ్యాప్తి చెందుతుందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయిన వారే కదా అని అల్లుకుపోతే అంతిమంగా నష్టపోయేది మనమేనన్నారు. ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ ఆప్తులతో,స్నేహితులతో, బంధు మిత్రులతో విస్తరిస్తోందన్నారు. అటువంటి ప్రమాదకర వైరస్ లక్షణాలు సోకినప్పుడు దాచిపెట్టాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని ఆయన తెలిపారు. విందులు, వినోదాలతో కరోనా వైరస్ అధికంగా వ్యాప్తిస్తోందని ఆయన హెచ్చరించారు. కాగితాలతో పాటు నోట్లు చేతులు మారినప్పుడు వైరస్ సోకే […]

Update: 2020-07-28 10:11 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆప్తులతోనే కరోనా వ్యాప్తి చెందుతుందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయిన వారే కదా అని అల్లుకుపోతే అంతిమంగా నష్టపోయేది మనమేనన్నారు. ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ ఆప్తులతో,స్నేహితులతో, బంధు మిత్రులతో విస్తరిస్తోందన్నారు. అటువంటి ప్రమాదకర వైరస్ లక్షణాలు సోకినప్పుడు దాచిపెట్టాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని ఆయన తెలిపారు. విందులు, వినోదాలతో కరోనా వైరస్ అధికంగా వ్యాప్తిస్తోందని ఆయన హెచ్చరించారు. కాగితాలతో పాటు నోట్లు చేతులు మారినప్పుడు వైరస్ సోకే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం సూర్యాపేట మున్సిపాలిటీ పాలకవర్గంతో సహా పట్టణ వర్తక వాణిజ్య వ్యాపార వృత్తి కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రి జగదీష్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన లాక్ డౌన్ అమలుపై ఆయా సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సత్ఫాలితాలు సాధించిందన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న అంబులెన్స్‌లతో గ్రామీణ ప్రాంతాల్లో టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు.

Tags:    

Similar News