పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత

దిశ, న్యూస్‌బ్యూరో: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించి సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో భాగస్వామ్యం కావాలని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ శివారులోని తన వ్యవసాయం క్షేత్రంలో మంత్రి మొక్కలు నాటారు. మనిషి ప్రతి వేడుకకు మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలని కోరారు. పర్యావరణాన్ని రక్షిస్తే అది మానవ జాతిని రక్షిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు. వృద్ధాశ్రమానికి విద్యుత్ కాంట్రాక్టర్ల […]

Update: 2020-07-18 07:33 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించి సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో భాగస్వామ్యం కావాలని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ శివారులోని తన వ్యవసాయం క్షేత్రంలో మంత్రి మొక్కలు నాటారు. మనిషి ప్రతి వేడుకకు మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలని కోరారు. పర్యావరణాన్ని రక్షిస్తే అది మానవ జాతిని రక్షిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు.

వృద్ధాశ్రమానికి విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ విరాళం

మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ‌లోని మహాలక్ష్మి వృద్దాశ్రమంలో అదనపు గది నిర్మాణం కోసం రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం ముందుకు రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే రవీంద్ర‌నాయక్ ఆయన అన్నారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదే ఆశ్రమంలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గది నిర్మాణం కోసం అసోసియేషన్ రెండు లక్షల నగదు‌ను చెక్ రూపంలో ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ చేతుల మీదుగా నిర్వాహకులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధాశ్రమాన్ని ఆదుకునేందుకు విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News