ఎలక్ట్రిక్ బండి నడిపిన మంత్రి ఏమన్నాడంటే..?
దిశ, వెబ్ డెస్క్: ఎలక్ట్రికల్ మోటార్ వాహనాలతో ఎన్నో లాభాలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిక్ టూవీలర్ షోరూంను మంత్రి ప్రారంభించి వాహనాన్ని నడిపారు. ఎలక్ట్రిక్ వాహనాలతో తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణం నాశనం కాకుండా ఉంటుందని చెప్పారు. కేవలం నాలుగు గంటల చార్జింగ్ తో రెండు వందల కిలోమీటర్లు వెళ్లవచ్చని చెప్పారు. ఎలాంటి ఇందన ఖర్చు ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించి […]
దిశ, వెబ్ డెస్క్: ఎలక్ట్రికల్ మోటార్ వాహనాలతో ఎన్నో లాభాలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిక్ టూవీలర్ షోరూంను మంత్రి ప్రారంభించి వాహనాన్ని నడిపారు. ఎలక్ట్రిక్ వాహనాలతో తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణం నాశనం కాకుండా ఉంటుందని చెప్పారు. కేవలం నాలుగు గంటల చార్జింగ్ తో రెండు వందల కిలోమీటర్లు వెళ్లవచ్చని చెప్పారు. ఎలాంటి ఇందన ఖర్చు ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించి పర్యావరణం కాపాడాలని ఆయన కోరారు.