ఎమ్మెల్సీకి మంత్రి కంగ్రాట్స్

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్ష‌లను తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు పార్టీ శ్రేణుల తరపున అభినందనలను తెలియజేశారు. కవిత మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్ కూడా […]

Update: 2020-10-12 07:48 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్ష‌లను తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు పార్టీ శ్రేణుల తరపున అభినందనలను తెలియజేశారు. కవిత మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్ కూడా రాలేదని తెలిపారు. తెలంగాణలో ఆ పార్టీలకు స్థానం లేదని మరోసారి రుజువైందని చెప్పారు.

Tags:    

Similar News