ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై హైదరాబాద్ అరణ్య భవన్‌లో అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పూర్తి ఆయకట్టుకు నీరు అందేలాగా పెండింగ్‌లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.