గణేష్ ఉత్సవాలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి అన్ని మతాల పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుంటున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, మండపాల […]

Update: 2021-08-28 04:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి అన్ని మతాల పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుంటున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులు అందరూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరిగేలా సహకరించాలని కోరారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తామన్నారు. ఇళ్లలో కూడా మట్టి వినాయక విగ్రహలను ప్రతిష్టించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించుకోవాలన్నారు.

Tags:    

Similar News