ఆ ఒక్క రాష్ట్రానికేనా కరోనా వ్యాక్సిన్

దిశ ప్రతినిధి, మెదక్: బీహార్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేస్తామనడం సిగ్గు చేటని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. తేలుకుట్టిన దొంగల్లా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ గెలిస్తే బావి […]

Update: 2020-10-23 09:12 GMT

దిశ ప్రతినిధి, మెదక్:
బీహార్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేస్తామనడం సిగ్గు చేటని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. తేలుకుట్టిన దొంగల్లా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ గెలిస్తే బావి కాడ మీటర్లు, కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కష్టాలు మొదలవుతాయని అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కరోనా మందును ఉచితంగా పంపిణీ చేస్తామని అనడం సిగ్గుచేటు అన్నారు. బీహార్‌‌లో ఉచితంగా కరోనా మందును పంపిణీ చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా పంపిణీ చేస్తుందని ప్రశ్నించారు.

Tags:    

Similar News