ఆడబిడ్డలకు అండగా నిలిచిన హరీశ్ రావు

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి హరీశ్ రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాలమణి అనే మహిళకు చెందిన ఇళ్లు కూలిపోయింది. ఎనిమిదేళ్ల కింద అనారోగ్యంతో భర్త రాజయ్య మృతిచెందడటంతో బాలమణి కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కనీసం ఇళ్లు కూడా కట్టుకోలేని స్థితిలో ఇన్నాళ్లు ఆమె కూతురి స్రవంతితో కలిసి జీవనం సాగించింది. వర్షం కారణంగా ఇళ్లు కూలిపోయి తల్లీకూతుళ్లు నిరాశ్రయులయ్యారు. సమాచారం […]

Update: 2020-12-19 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి హరీశ్ రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాలమణి అనే మహిళకు చెందిన ఇళ్లు కూలిపోయింది. ఎనిమిదేళ్ల కింద అనారోగ్యంతో భర్త రాజయ్య మృతిచెందడటంతో బాలమణి కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కనీసం ఇళ్లు కూడా కట్టుకోలేని స్థితిలో ఇన్నాళ్లు ఆమె కూతురి స్రవంతితో కలిసి జీవనం సాగించింది. వర్షం కారణంగా ఇళ్లు కూలిపోయి తల్లీకూతుళ్లు నిరాశ్రయులయ్యారు. సమాచారం అందుకున్న మంత్రి హ‌రీశ్ రావు వెంటనే వారికి అపన్న హస్తం అందించారు. ఇళ్లు కూలిన చోటే కొత్త ఇళ్లు కట్టించారు. అంతేగాకుండా శనివారం మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా త‌ల్లి, కూతురుకు కొత్త దుస్తులు అందించి, మిఠాయిలు తినిపించారు.

Tags:    

Similar News