ఆరోగ్యశ్రీపై ఈటల కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గతకొన్నిరోజులుగా ఆరోగ్య శ్రీ విషయంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీలో లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్‌లో లాభదాయకంగా ఉన్న రోగాలకే చికిత్స చేస్తున్నారని, రోగులను రిజెక్ట్ చేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాంధీ మినహా అన్ని ఆస్పత్రుల్లో ఇతర సాధారణ సేవలు […]

Update: 2020-10-05 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గతకొన్నిరోజులుగా ఆరోగ్య శ్రీ విషయంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీలో లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్‌లో లాభదాయకంగా ఉన్న రోగాలకే చికిత్స చేస్తున్నారని, రోగులను రిజెక్ట్ చేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాంధీ మినహా అన్ని ఆస్పత్రుల్లో ఇతర సాధారణ సేవలు మొదలయ్యాయని తెలిపారు. కోవిడ్ డ్యూటీల్లో ఉన్న వాళ్లకు మాత్రమే క్వారంటైన్ సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శ్రీలో చేర్చాలని యోచిస్తున్నట్టు సమాచారం.

Tags:    

Similar News