త్వరలో మరో 8 డయాగ్నస్టిక్ కేంద్రాలు :ఈటల
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని లాలాపేటలో డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బస్తీ దవాఖానాలకు వెళ్లే రోగుల కోసం డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఈ డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో రోగులకు అవసరమైన పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 8 డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభించామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. త్వరలోనే మరో 8 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎక్స్‌రే, ఈసీజీ, […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని లాలాపేటలో డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బస్తీ దవాఖానాలకు వెళ్లే రోగుల కోసం డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఈ డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో రోగులకు అవసరమైన పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 8 డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభించామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. త్వరలోనే మరో 8 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, రేడియాలజీ, పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేశామని.. 8 ఆపరేషన్ థియేటర్లలో అవయవ మార్పిడి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధునిక సౌకర్యాలు అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో ల్యాబ్‌లు విజయవంతమైతే జిల్లాలోనూ ఏర్పాటు చేస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.