Tirumala: తిరుమల శ్రీవారి సేవలో హీరో అక్కినేని అఖిల్
సినీ నటుడు అక్కినేని అఖిల్(Hero Akhil) ఇవాళ(శుక్రవారం) ఉదయం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
దిశ,వెబ్‌డెస్క్: సినీ నటుడు అక్కినేని అఖిల్(Hero Akhil) ఇవాళ(శుక్రవారం) ఉదయం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఇదిలా ఉంటే.. శ్రీవారి దర్శనార్థం శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. వీరిలో తెలంగాణ హైకోర్టు(Telangana High court) జస్టిస్ వేణుగోపాల్(Justice Venugopal), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్(Chief Secretary Nirab Kumar Prasad) స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.