Innovation University : 'ఇన్నోవేషన్ యూనివర్సిటీ'కి ఏపీ కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్(AP) లో మరో ప్రతిష్టాత్మక 'ఇన్నోవేషన్ యూనివర్సిటీ'(Innovation University) ఏర్పాటు కానుంది.

Update: 2024-12-20 11:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(AP) లో మరో ప్రతిష్టాత్మక 'ఇన్నోవేషన్ యూనివర్సిటీ'(Innovation University) ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రముఖ 'ఫిజిక్స్ వాలా' (PhysicsWala)తో శుక్రవారం కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్య ఆధునీకరణ కోసం టీబీఐ(TBI)తో ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు నేడు సచివాలయంలో ఆయా సంస్థల ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏపీ యువతకు, విద్యార్థులకు ప్రపంచస్థాయి అవకాశాలే ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందాలు చేసుకున్నట్టు, రాష్ట్రాన్ని ఐటీ రంగంలో దేశంలో నెంబర్ 1గా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని లోకేష్ పేర్కొన్నారు.   

Tags:    

Similar News