CM Chandrababu : భూకబ్జా చేయాలనుకుంటే జైలు గుర్తుకు రావాలి : సీఎం చంద్రబాబు

కబ్జా చేయాలనుకున్న భూమి కనిపిస్తే చాలు.. జైలు గుర్తుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Update: 2024-12-20 11:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : కబ్జా చేయాలనుకున్న భూమి కనిపిస్తే చాలు.. జైలు గుర్తుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సెంటు భూమి కబ్జా(Land grabbing) చేసినా తాట తీస్తామన్నారు. ఈడ్పుగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు(CM Chandrababu) మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి పార్టీలను 93 శాతం గెలిపించారంటే మీ అభిమానం నాకు అర్ధం అవుతోందన్నారు. మీ ఆశలు నెరవేర్చే ప్రభుత్వం వచ్చిందని హామీ ఇస్తున్నానని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేశారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీల్లో మెజార్టీ భూ సమస్యలే ఉన్నాయని, నాకు ఇప్పటివరకు లక్షా 57 వేల ఆర్జీలు వచ్చాయని తెలిపారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని, సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తాం.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

అంతకుముందు చంద్రబాబు కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవాకేంద్రాన్ని మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సేవ కేంద్రంలో రైతు ఆకునూరి సాంబశివరావు తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని.. కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News