KTR : ఫార్ములా ఈ రేస్ కేసు..ఓఆర్ఆర్ లీజుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తనపై నమోదైన ఫార్ములా ఈ రేస్ కేసు(Formula E race Case)..ఓఆర్ఆర్ లీజు(ORR lease) విచారణ(Inquiry) అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Update: 2024-12-20 06:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : తనపై నమోదైన ఫార్ములా ఈ రేస్ కేసు(Formula E race Case)..ఓఆర్ఆర్ లీజు(ORR lease) విచారణ(Inquiry) అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి లేదని తేలిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్ ఎండీఏ ఒక కార్పోరేషన్ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైన డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉందన్నారు. హెఎచ్ ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని, దానికి అ మేరకు స్వసంత్రత ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.ముఖ్యమంత్రి, ఇతరులెవరైనా మంత్రులు కొంత మంది సైకోలు ఈ వివాదాన్ని తప్పుదొవ పట్టిస్తున్నారో తెలువాల్సి ఉందన్నారు. ఈ కేసు క్వాష్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ పైన కోర్టు తెలుస్తుందన్నారు. ఈ కేసుల అణాపైసా అవినీతి లేదని, అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకు పోతే వాళ్ల ఇష్టమని, న్యాయ పరంగా ఎదుర్కొంటామన్నారు.

అవుటర్ రింగ్ రోడ్డు లీజు ఒప్పందంపై ప్రభుత్వం సిట్ విచారణ ఏర్పాటు చేయడంపై కేటీఆర్ స్పందిస్తూ టీవోటీ దేశంలో ఇప్పటికే అమలులో ఉందని, ఈ విధానంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించామని వెల్లడించారు. ఆర్థిక వనరుల సమీకరణపైన అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చిందని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చు అని సూచించిందని, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టీవోటీ విధానంలోనే అవుటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులను సేకరించామన్నారు. ప్రయివేట్ కంపెనీకి లబ్ది చేకూర్చినట్టు అరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదన్నారు. గతంలో అవుటర్ రింగ్ రోడ్డు లీజుపైన రేవంత్ రెడ్డి మాట్లాడిన లక్ష కోట్ల అవినీతి అడ్డగోలు మాటలు పైన హెచ్ఎండీఏ పరువు నష్టం కేసు వేసిందని గుర్తు చేశారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి పైన హెచ్ఎండీఏ వేసిన కేసు అలాగే ఉందన్నారు. ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డుపైన అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారని, మరి ఎందుకు అవుటర్ రింగ్ రోడ్డు లీజును రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డినే మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్నారని, ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన కింద ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని నిలదీశారు. తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు.

అందుకే ఔటర్ రింగ్ రోడ్డు రీజనింగ్ వెంటనే రద్దుచేసి సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరగాలని కోరుతున్నామన్నారు. ఒకవేళ కుంభకోణం జరిగిఉంటే ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీని కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదని కేటీఆర్ నిలదీశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారని, జడ్జి ఏర్పాటు చేసే బృందాన్ని జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తామన్నారు. మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలన్నారు. పదివేల కోట్ల రూపాయల కోకాపేట భూముల కుంభకోణం అంటున్న ప్రభుత్వం భూముల అమ్మకాన్ని కూడా రద్ధు చేయాలని సవాల్ చేశారు. ప్రభుత్వం సభ్యులకు శిక్షణ ఇచ్చి స్పీకర్, ప్రతిపక్ష సభ్యులపైకి వాటర్ బాటిళ్లు, పేపర్లు విసరడం ఏలా అని శిక్షణ ఇచ్చానట్లున్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్ ను కూడా దళితుడు, దళితుడు అంటూ పదే పదే చెప్పడం అయన గౌరవాన్ని తగ్గించేలా చేయడమేనన్నారు. 

Tags:    

Similar News