మహిళల గౌరవాన్ని పెంచాం.. ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

దిశ, కమలాపూర్: మహిళలకు స్త్రీ నిధి రుణాల ద్వారా సమాజంలో గౌరవం పెరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్‌లో శనివారం ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని ఋణాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ఋణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, వారు ఆర్థికంగా ఎదగడం కోసం వడ్డీలేని […]

Update: 2021-08-07 07:59 GMT

దిశ, కమలాపూర్: మహిళలకు స్త్రీ నిధి రుణాల ద్వారా సమాజంలో గౌరవం పెరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్‌లో శనివారం ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని ఋణాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ఋణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, వారు ఆర్థికంగా ఎదగడం కోసం వడ్డీలేని రుణాలు అందజేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలపై అపారమైన నమ్మకం ఉందని, మహిళలు ఆర్థికంగా గౌరవంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ఎర్రబెల్లి వెల్లడించారు.

Tags:    

Similar News