చంద్రబాబు సవాల్‌కు నేను రెడీ: మంత్రి అప్పల రాజు
దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంత్రి అప్పల రాజు సవాల్ విసిరారు. 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ముందు ఉత్తరాంధ్ర ప్రాంతం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలన్నారు. తాను కూడా పలాసలో రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతేకాదు పలాసలో తనపై చంద్రబాబు నాయుడు పోటీ చేసి గెలవాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ గెలిస్తే రాష్ట్ర ప్రజల ఆమోదం ఉన్నట్లే అని […]
దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంత్రి అప్పల రాజు సవాల్ విసిరారు. 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ముందు ఉత్తరాంధ్ర ప్రాంతం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలన్నారు. తాను కూడా పలాసలో రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతేకాదు పలాసలో తనపై చంద్రబాబు నాయుడు పోటీ చేసి గెలవాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ గెలిస్తే రాష్ట్ర ప్రజల ఆమోదం ఉన్నట్లే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఊరికే కామెడీ స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని మంత్రి అప్పల రాజు ఎద్దేవా చేశారు. ఎటువంటి చాలెంజ్ కైనా తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.