‘దరఖాస్తుదారులకూ బియ్యం పంపిణీ’

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న 3,500 మందికీ ఈ నెలలోనే 12 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్టు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను కేంద్రప్రభుత్వం హాట్‌స్పాట్‌గా ప్రకటించినందునా ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సామాజిక […]

Update: 2020-04-18 03:04 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న 3,500 మందికీ ఈ నెలలోనే 12 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్టు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను కేంద్రప్రభుత్వం హాట్‌స్పాట్‌గా ప్రకటించినందునా ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్‌లు, పాత్రికేయులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశారు.

tag; minister allola indrakaran reddy, mask distribution, nirmal

Tags:    

Similar News