పారిశుద్ధ్య కార్మికుల అలుపెరగని పోరాటం: మంత్రి అల్లోల

దిశ, ఆదిలాబాద్: కరోనా కట్టడి కోసం పారిశుద్ధ్య కార్మికులు అలుపెరగకుండా పోరాడుతున్నారని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మే డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, మున్సిప‌ల్ సిబ్బందితో కలిసి ఆయన భోజ‌నం చేశారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు చేస్తున్న సేవ‌ల‌కుగాను కార్మికులను శాలువాల‌తో స‌త్క‌రించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో వైద్యులు, పోలీసుల‌తోపాటు పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌న్నారు. కరోనా కట్టడికి రాత్రనక, పగలనక పట్టణాన్నిపరిశుభ్రంగా ఉంచుతున్నారని చెప్పారు. వారి సేవలకు చేతులు జోడించి […]

Update: 2020-05-01 05:42 GMT

దిశ, ఆదిలాబాద్: కరోనా కట్టడి కోసం పారిశుద్ధ్య కార్మికులు అలుపెరగకుండా పోరాడుతున్నారని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మే డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, మున్సిప‌ల్ సిబ్బందితో కలిసి ఆయన భోజ‌నం చేశారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు చేస్తున్న సేవ‌ల‌కుగాను కార్మికులను శాలువాల‌తో స‌త్క‌రించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో వైద్యులు, పోలీసుల‌తోపాటు పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌న్నారు. కరోనా కట్టడికి రాత్రనక, పగలనక పట్టణాన్నిపరిశుభ్రంగా ఉంచుతున్నారని చెప్పారు. వారి సేవలకు చేతులు జోడించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌భుత్వం మీకు ఎప్పుడు అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ ఫారూఖీ, ఎస్పీ శ‌శిధ‌‌ర్ రాజు, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్ పాల్గొన్నారు.

Tags: Adilabad,Sanitation workers,Minister Allola Indrakaran reddy

Tags:    

Similar News