‘ఆ విషయంలో దేశానికి.. తెలంగాణ ఆదర్శం’
దిశ, ఖమ్మం: గత ఐదు విడతల హరితహారం కన్నా, ఈ ఆరో విడుత కార్యక్రమం విభిన్నంగా ముందుకు వెళ్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. వందశాతం మొక్కలు మనుగడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం మినీ ట్యాంక్‌బండ్‌పై వెయ్యి మొక్కలు, వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ రేంజ్ పార్కులో 117 ఎకరాల్లో 57,700 మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… హరితహారం కార్యక్రమంలో […]
దిశ, ఖమ్మం: గత ఐదు విడతల హరితహారం కన్నా, ఈ ఆరో విడుత కార్యక్రమం విభిన్నంగా ముందుకు వెళ్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. వందశాతం మొక్కలు మనుగడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం మినీ ట్యాంక్‌బండ్‌పై వెయ్యి మొక్కలు, వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ రేంజ్ పార్కులో 117 ఎకరాల్లో 57,700 మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… హరితహారం కార్యక్రమంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ అద్భుత ఆలోచనలోంచి పుట్టిందే ఈ హరిత హారం కార్యక్రమమని మంత్రి అజయ్ అన్నారు. గత ఐదు విడతలకు భిన్నంగా ఈసారి హరితహారంను నిర్వహిస్తున్నామని, నూటికి నూరు శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మేయర్ పాపాలాల్, కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత మున్సిపల్ కమిషనర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.