అధికారుల తీరుపై మంత్రి అజ‌య్‌ ఫైర్‌

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మిషన్ భగీరథ పనులు జ‌రుగుతున్న తీరుపై మంత్రి అజ‌య్‌కుమార్ సంబంధిత అధికారుల‌పై ఫైర్ అయ్యారు. గురువారం ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ బైపాస్ రోడ్, ఎన్‌ఎస్‌పీ కాలువ వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇంటింటికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠత్మికంగా తీసుకున్న కార్యక్రమంలో అలసత్వం వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగం పెంచాలని ఆదేశించారు. అనంతరం టీటీడీసీలో నిర్వహించిన రివ్యూలో మాట్లాడుతూ… ఖమ్మం జిల్లా కేంద్రంలో […]

Update: 2020-08-27 08:24 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మిషన్ భగీరథ పనులు జ‌రుగుతున్న తీరుపై మంత్రి అజ‌య్‌కుమార్ సంబంధిత అధికారుల‌పై ఫైర్ అయ్యారు. గురువారం ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ బైపాస్ రోడ్, ఎన్‌ఎస్‌పీ కాలువ వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇంటింటికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠత్మికంగా తీసుకున్న కార్యక్రమంలో అలసత్వం వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగం పెంచాలని ఆదేశించారు.

అనంతరం టీటీడీసీలో నిర్వహించిన రివ్యూలో మాట్లాడుతూ… ఖమ్మం జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పనులపై అధికారులను నిలదీశారు. మిషన్ భగీరథ ట్యాంక్ (ఓహెచ్‌ఆర్‌ఎస్‌) పనుల వివరాలు ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ట్యాంక్‌లకు కలెక్షన్లు ఇచ్చారని, ట్యాంక్‌ల నిర్మాణం ఇంకా పూర్తి చేయకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. నగరంలో అంతర్గత పైప్‌లైన్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలు రావడం వాటిని పరిష్కరించడం జరుగుతుందని అధికారులు మంత్రికి విన్నవించారు.

అధికారులు అలసత్వం ప్రదర్శించటం ఏంటని ప్రశ్నించారు. పైప్‌లైన్ల పనులను ఎందుకు ముందుకు సాగట్లేదని ఎందుకు పనులను వదిలేశారని ప్రశ్నించారు. అధికారులు సమన్వయ పర్చుకొని సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి వాడుకలోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. అనంత‌రం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్‌లో రూ.2 కోట్లతో ఇందిరా నగర్ నుంచి బైపాస్ రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

Tags:    

Similar News