జేసీ దివాకర్ రెడ్డికి షాక్.. రూ.100 కోట్ల జరిమానా

దిశ, ఏపీ బ్యూరో : మాజీ ఎంపీ జేసీ దివాకర్​రెడ్డికి మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. అక్రమంగా సున్నపరాయి గనులు తవ్వేసినందుకు రూ.100 కోట్ల జరిమానా విధించారు. అపరాధ రుసుం చెల్లించకుంటే ఆర్ అండ్ ఆర్ యాక్ట్​ కింద ఆస్తులు జప్తు చేస్తామని మంగళవారం నోటీసులిచ్చారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనఉప్పలపాడులో14 లక్షల మెట్రిక్ టన్నుల సున్నపరాయిని తవ్వుకున్నట్లు అధికారులు […]

Update: 2020-12-01 09:29 GMT

దిశ, ఏపీ బ్యూరో : మాజీ ఎంపీ జేసీ దివాకర్​రెడ్డికి మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. అక్రమంగా సున్నపరాయి గనులు తవ్వేసినందుకు రూ.100 కోట్ల జరిమానా విధించారు. అపరాధ రుసుం చెల్లించకుంటే ఆర్ అండ్ ఆర్ యాక్ట్​ కింద ఆస్తులు జప్తు చేస్తామని మంగళవారం నోటీసులిచ్చారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనఉప్పలపాడులో14 లక్షల మెట్రిక్ టన్నుల సున్నపరాయిని తవ్వుకున్నట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

Tags:    

Similar News