మహిళపై ఎంఐఎం నేత తనయుడు దాడి

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బైంసాలో ఒక మహిళపై అక్కడి ఎంఐఎం నేత తనయుడు దాడి చేయడం వివాదాస్పదం అవుతున్నది. అందరూ చూస్తుండగానే మహిళపై సదరు వ్యక్తి మంగళవారం సాయంత్రం దాడి చేయడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. మహిళను రోడ్డుపై పడేసి కొట్టడంతో ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. అయితే ఇది భూమికి సంబంధించిన వివాదంగా పోలీసులు చెబుతున్నారు. కానీ మతపరమైన ఘర్షణ‌గా సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది. దీన్ని నమ్మవద్దని […]

Update: 2020-10-06 10:39 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బైంసాలో ఒక మహిళపై అక్కడి ఎంఐఎం నేత తనయుడు దాడి చేయడం వివాదాస్పదం అవుతున్నది. అందరూ చూస్తుండగానే మహిళపై సదరు వ్యక్తి మంగళవారం సాయంత్రం దాడి చేయడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. మహిళను రోడ్డుపై పడేసి కొట్టడంతో ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. అయితే ఇది భూమికి సంబంధించిన వివాదంగా పోలీసులు చెబుతున్నారు. కానీ మతపరమైన ఘర్షణ‌గా సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది. దీన్ని నమ్మవద్దని నిర్మల్ జిల్లా ఇంచార్జ్ ఎస్. పి విష్ణు వారియర్ కోరారు. సోషల్ మీడియాలో ఈ ఘటనను వక్రీకరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News