బ్రేకింగ్.. 14 మంది మిలీషియా సభ్యులు లొంగుబాటు..

దిశ, కొత్తగూడెం : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న 14 మంది మిలీషియా సభ్యులు ఎస్పీ సునీల్ దత్ సమక్షంలో లొంగిపోయారు. ఇటీవల కాలంలో ఈ 14 మందిని సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యులు పెసర్ల పాడు, గుట్టపాడు, చంద్ర ప్రాంతాల నుంచి బలవంతంగా తీసుకువెళ్లి శిక్షణ ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. వీరందరూ మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమిటీ కోసం పని చేస్తున్నారని తెలిపారు. సీసీఐ మావోయిస్టు పార్టీ.. వారు నిర్వహించే మీటింగ్‌లకు హాజరు […]

Update: 2021-09-23 03:01 GMT

దిశ, కొత్తగూడెం : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న 14 మంది మిలీషియా సభ్యులు ఎస్పీ సునీల్ దత్ సమక్షంలో లొంగిపోయారు. ఇటీవల కాలంలో ఈ 14 మందిని సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యులు పెసర్ల పాడు, గుట్టపాడు, చంద్ర ప్రాంతాల నుంచి బలవంతంగా తీసుకువెళ్లి శిక్షణ ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. వీరందరూ మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమిటీ కోసం పని చేస్తున్నారని తెలిపారు. సీసీఐ మావోయిస్టు పార్టీ.. వారు నిర్వహించే మీటింగ్‌లకు హాజరు కావాలని, రేషన్ పంపించాలని వేధిస్తున్నారని.. వారి సిద్ధాంతాలు, నిత్యం భయాందోళనకు గురై.. ప్రశాంతమైన జీవితం గడపడానికి ఈ 14 మంది లొంగిపోయినట్లు తెలిపారు.

మావోయిస్టు పార్టీ సభ్యులు అమాయక గిరిజనులను భయబ్రాంతులకు గురి చేసి బలవంతంగా తీసుకు వెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నారని ఎస్పీ ఆరోపించారు. మీటింగ్‌లకు హాజరు కావాలని మావోయిస్టు పార్టీ సభ్యులు గిరిజనులను బలవంతం చేస్తున్నట్లు, ఒకవేళ మీటింగ్‌లకు హాజరు కాకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని గిరిజనులను బెదిరించడం పట్ల ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మావోయిస్టు పార్టీలో పనిచేసే దళ సభ్యులు, మిలీషియా సభ్యులు మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జన జీవన స్రవంతిలో కలవాలనుకునే వారు వారి బంధువుల ద్వారా, స్థానిక పోలీసుల ద్వారా గానీ సంప్రదించి ప్రశాంత జీవనాన్ని గడపడానికి వారికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో లొంగి పోవాల్సిందిగా ఎస్పీ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News