ముగ్గురు మిలీషియా సభ్యులు అరెస్టు

దిశ, భద్రాచలం : ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులను చర్ల పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం… చర్ల ఎస్ఐ, స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ 141 ఏ కంపెనీ పోలీసులు కలిసి తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో తిప్పాపురం‌ నుంచి పెద్దమిడిసిలేరు వైపు నడుచుకుంటూ వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి చేతిలో వస్తువులతో పారిపోవడానికి ప్రయత్నించారు. కాగా వారిని వెంబడించి పట్టుకుని […]

Update: 2020-11-29 10:52 GMT

దిశ, భద్రాచలం : ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులను చర్ల పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం… చర్ల ఎస్ఐ, స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ 141 ఏ కంపెనీ పోలీసులు కలిసి తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో తిప్పాపురం‌ నుంచి పెద్దమిడిసిలేరు వైపు నడుచుకుంటూ వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి చేతిలో వస్తువులతో పారిపోవడానికి ప్రయత్నించారు. కాగా వారిని వెంబడించి పట్టుకుని పోలీసులు విచారించారు. చర్ల మండలం కిష్టారంపాడుకు చెందిన వెట్టి భీమరాజు (24), బత్తినిపల్లికి చెందిన సున్నం నాగేశ్వరరావు (25), వెల్కం పెంటయ్య (25)లు గత మూడేళ్ళుగా మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. వారి వద్ద నుంచి మారణాయుధం (బూబీ ట్రూప్స్), మావోయిస్టు కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News