అడ్డా కూలీల ఆకలి కేకలు

దిశ, ఆదిలాబాద్: ఈ రోజైతే గడవని రేపంటూ చూద్దాం.. ఈ పూట నిండనీ బతుకు సాగిద్దాం అనుకునే వలస కూలీల పాలిట కరోనా శాపంగా మారింది. ఎండనకా, వాననకా కష్టపడి పనిచేసి పొట్ట నింపుకునే అడ్డా కూలీల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌక్ లో కూలీలు, కూలీల అడ్డ వద్ద సోమవారం మధ్యాహ్నం 12 అయినా పని లేక ఎవరైనా కూలీకి పిలుస్తారేమోనని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. కరోనా మూలంగా భవన నిర్మాణాలు ఆగిపోవడంతో […]

Update: 2021-04-26 02:56 GMT

దిశ, ఆదిలాబాద్: ఈ రోజైతే గడవని రేపంటూ చూద్దాం.. ఈ పూట నిండనీ బతుకు సాగిద్దాం అనుకునే వలస కూలీల పాలిట కరోనా శాపంగా మారింది. ఎండనకా, వాననకా కష్టపడి పనిచేసి పొట్ట నింపుకునే అడ్డా కూలీల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌక్ లో కూలీలు, కూలీల అడ్డ వద్ద సోమవారం మధ్యాహ్నం 12 అయినా పని లేక ఎవరైనా కూలీకి పిలుస్తారేమోనని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. కరోనా మూలంగా భవన నిర్మాణాలు ఆగిపోవడంతో కూలీలకు పనిదొరకక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వాణిజ్య వ్యాపార రంగాలతో పాటు భవన నిర్మాణ కార్మిక రంగంపై సైతం కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. భవన నిర్మాణ కార్మిక రంగంలో వివిధ రాష్ట్రాలతో పాటు జిల్లాకు చెందిన కార్మికులు వేల సంఖ్యలో ఆధారపడి జీవినం సాగిస్తున్నారు. కరోనా కారణంగా భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. జిల్లాకు చెందిన కొంత మంది కార్మికులు పని కోసం కూలీ అడ్డా వద్దకు చేరుకొని ప్రతిరోజు వేచి చూస్తున్నారు. మిట్టమధ్యాహ్నం అయిన పని దొరకక మండుటెండల్లో వేచి ఉన్నారు. దీంతో ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News