కుటుంబంపై బెంగతో.. గల్ఫ్‌లో జగిత్యాల వాసి సూసైడ్

దిశ, కోరుట్ల: సొంతూర్లో ఉపాధి లేకపోవడంతో మూడెళ్ల కిందట గల్ప్ వెళ్లిన వెళ్లిన ఓ వలస కార్మికుడు కుటుంబంపై బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుండటంతో తన కుటుంబం ఎలా ఉందోనని బెంగపెట్టుకున్నాడు. ఎలాగైనా స్వదేశానికి వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేశాడు.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వానికి అతను పెట్టుకున్న వినతి పై స్పందన రాకపోవడం..మిగతా ప్రయత్నాలు కూడా విఫలమవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాల్లోకివెళితే..జగిత్యాల జిల్లా మోతె గ్రామానికి చెందిన రేగుంట రాము, అంజలి […]

Update: 2020-06-21 07:12 GMT

దిశ, కోరుట్ల: సొంతూర్లో ఉపాధి లేకపోవడంతో మూడెళ్ల కిందట గల్ప్ వెళ్లిన వెళ్లిన ఓ వలస కార్మికుడు కుటుంబంపై బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుండటంతో తన కుటుంబం ఎలా ఉందోనని బెంగపెట్టుకున్నాడు. ఎలాగైనా స్వదేశానికి వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేశాడు.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వానికి అతను పెట్టుకున్న వినతి పై స్పందన రాకపోవడం..మిగతా ప్రయత్నాలు కూడా విఫలమవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాల్లోకివెళితే..జగిత్యాల జిల్లా మోతె గ్రామానికి చెందిన రేగుంట రాము, అంజలి దంపతులు. వీరికి వైష్ణవి, అమూల్య అనే ఇద్దరు కూతుర్లు కలరు. ఉన్న ఊర్లో ఉపాధి దొరకకపోవడంతో గత మూడేళ్ల కిందట కువైట్‌‌కు వెళ్లి కపిల్ అనే వ్యక్తి వద్ద కార్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఆరు నెలల కిందట సెలవు పై స్వగ్రామానికి వచ్చి తిరిగి మళ్లీ డ్యూటిలో జాయిన్ అయ్యాడు. అయితే 3 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో కొన్ని దేశాలు లాక్‌‌డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలోనే తన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారోనని రాము అందోళనకు గురయ్యాడు. తాను ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్టు యాజమాని చెప్పినా అతను అంగీకరించలేదు. తనను ఎలాగైనా స్వగ్రామానికి తీసుకువచ్చేలా చూడాలని సీఎం కేసీఆర్‌ను వేడుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ పెట్టాడు. అయినా ఫలితం లేకపోవడంతో జూన్ 2న పని ప్రదేశంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు.

అయితే రాము గత 20 రోజులుగా ఫోన్ చేయకపోవడం తో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గల్ఫ్ బాదితుల సంక్షేమ సంఘ నాయకుడు చాంద్ పాషాను సంప్రదించారు. ఎంక్వరీ చేసిన ఆయన రాము ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. రాష్ట్రం నుంచి వలస వెళ్లిన కార్మికులకు ప్రభుత్వం భరోసా ఇవ్వకపోగా, స్వదేశానికి వచ్చే వ్యక్తులు టికెట్ డబ్బులు కూడా వారే భరించుకోవాలని చెప్పడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని చాంద్ పాషా తెలిపారు.

Tags:    

Similar News