స్వరాష్ట్రాలకు పంపించాలని వలస కూలీల ఆందోళన
దిశ, ఖమ్మం: స్వరాష్ట్రాలకు పంపించాలని డిమాండు చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో వందల మంది వలస కూలీలు మంగళవారం ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను తరలించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండ్రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారి నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వల్ల చేయడానికి పని, తినడానికి తిండి లేక అర్ధాకలితో […]
దిశ, ఖమ్మం: స్వరాష్ట్రాలకు పంపించాలని డిమాండు చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో వందల మంది వలస కూలీలు మంగళవారం ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను తరలించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండ్రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారి నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వల్ల చేయడానికి పని, తినడానికి తిండి లేక అర్ధాకలితో పడుకుంటున్నామని కూలీలు వాపోయారు. దీనిపై స్పందించిన అధికారులు వలస కూలీలను సొంతూర్లకు పంపేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే రైల్వే శాఖ అధికారులతో కలెక్టర్, పోలీస్ కమిషనర్ మాట్లాడినట్టు పేర్కొన్నారు. శ్రామిక్ రైళ్ల ద్వారా వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు ఇప్పటికే జాబితాను సిద్ధం చేశామన్నారు. కాగా, రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న వలస కార్మికులను అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది.
Tags: migrant labour, in states, immediate send, demand state and central govt, Khammam