మిడిల్ క్లాస్ ఫండ్’ కు ఒక్కరోజే 18 లక్షల విరాళాలు : విజయ్ దేవరకొండ

దిశ వెబ్ డెస్క్: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా… ఎవరు ఏమనుకున్నా.. తన మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ పోతాడు. తను ఎంచుకునే సినిమాల్లానే.. తను రియల్ గానే అందరికంటే భిన్నమైన దారిలో వెళుతుంటాడు. లాక్డౌన్ వేళ.. విజయ్ చేస్తున్న పనులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. తాజాగా కరోనా వైరస్‌ కారణంగా.. నిరుపేదలు, ఉపాధి కోల్పోయిన వాళ్లు పడుతున్న కష్టాలకు స్పందిచిన విజయ్, వారికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చాడు. […]

Update: 2020-04-27 05:31 GMT

దిశ వెబ్ డెస్క్: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా… ఎవరు ఏమనుకున్నా.. తన మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ పోతాడు. తను ఎంచుకునే సినిమాల్లానే.. తను రియల్ గానే అందరికంటే భిన్నమైన దారిలో వెళుతుంటాడు. లాక్డౌన్ వేళ.. విజయ్ చేస్తున్న పనులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. తాజాగా కరోనా వైరస్‌ కారణంగా.. నిరుపేదలు, ఉపాధి కోల్పోయిన వాళ్లు పడుతున్న కష్టాలకు స్పందిచిన విజయ్, వారికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చాడు. దీని కోసం ఆయన రెండు చారిటీ సంస్థలను ఏర్పాటు చేశారు. నిత్యవసరాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారికోసం 25లక్షల రూపాయలతో ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌(ఎం.సి.ఎఫ్‌) ఏర్పాటు చేయగా, అలాగే యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ‘ది విజయ్‌ దేవరకొండ ఫౌండేషన్‌(టి.డి.ఎఫ్‌)’ను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న చాలా మంది విజయ్ మిడిల్ క్లాస్ ఫండ్ ప్లాన్ కి మద్దతు పలుకుతూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా విజయే చెప్పుకొచ్చాడు. తన ఎంసీఎఫ్ కు ఒక్క రోజే 18 లక్షలకు పైగా విరాళాలు వచ్చాయని వెల్లడించాడు.

యంగ్ హీరో విజయ్ దేవరకొండ 25లక్షలతో కనీస నిధితో 2000 కుటుంబాల అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో… www.thedeverakondafoundation.org ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వెబ్ సైట్ లో లాగిన్ అయి తమ వివరాలను నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారు. దగ్గరలోని కిరాణ షాపుకు వెళ్లి సరకులను కొనుగోలు చేసి.. ఆ కిరాణా బిల్లును వారికి పంపిస్తే… ఆ డబ్బులను పౌండేషన్‌ సభ్యులు చెల్లిస్తారు. ఇందుకు దాతల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని విజయ్ తెలియజేశారు. ఆదివారం రాత్రి వరకు రూ. 18,74, 805 రూపాయలు విరాళం అందినట్లు వెల్లడించారు. మొత్తంగా 1800 మంది తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందించారని తెలిపారు. ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ‘మిడిల్ క్లాస్ ఫండ్’ (ఎంసీఎఫ్) వివరాలను ట్విటర్ వేదికగా షేర్ చేస్తానని పేర్కొన్నారు. ‘ఈ రోజు నేను మ్యాజిక్ చూశాను. ఎంసీఎఫ్ విజయం మీదే. మీరు నా అమౌంట్ ని డబుల్ చేశారు. రెండు వేల కుటుంబాలను ఆదుకోవాలనుకున్నాం. అది ఇప్పుడు 4 వేల కుటుంబాలకు చేరువైంది. ఎంసీఎఫ్ అమౌంట్ డబుల్ అయ్యింది. నలుగురితో ఇది ప్రారంభమైంది. రేపు 34 అవుతుంది. ’ అని ట్విట్టర్ వేదికగా విజయ్ ఈ విషయాలను వెల్లడించారు.

tags : vijay devarakonda, twitter, middle class fund,

Tags:    

Similar News