బండి సంజయ్‌తో కలిసి నడిచిన మిడ్ మానేరు బాధితులు

దిశ, సిరిసిల్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 30వ రోజుకు చేరుకుంది. ఆదివారం సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రకు ముందు బద్దెనపల్లి వద్ద చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మిడ్ మానేరు భూ నిర్వాసితులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలపై పోరాటం […]

Update: 2021-09-26 07:52 GMT

దిశ, సిరిసిల్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 30వ రోజుకు చేరుకుంది. ఆదివారం సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రకు ముందు బద్దెనపల్లి వద్ద చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మిడ్ మానేరు భూ నిర్వాసితులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలపై పోరాటం చేయాలని బండి సంజయ్‎కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. బండి సంజయ్‎ని కలిసి తమను విధుల్లోకి తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం అందజేశారు. పాదయాత్రలో భాగంగా మదనపల్లిలో చేనేత కార్మికులను బండి సంజయ్ కలిశారు. నేత కార్మికులు ఏర్పాటు చేసిన మగ్గం నేశారు. అనంతరం నేత కార్మికులు సంజయ్‎ని సన్మానించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని బండి సంజయ్ వారికి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News