తెలంగాణ ప్రజల్లో టెన్షన్.. టీకా తీసుకోని వారికి వేసుకున్నట్టు మెసేజ్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా టీకా తీసుకోకపోయినా, చాలా మందికి వ్యాక్సిన్ వేసుకున్నట్టు మెసేజ్‌లు వస్తున్నాయి. అంతేగాక డోసులు తీసుకున్నట్లు ఒకరి మెసేజ్‌లు మరొకరికి పంపుతున్నారు. మరోవైపు కేవలం తొలి డోసు తీసుకున్నా, రెండు డోసులు పూర్తి అయినట్టు సమాచారం వస్తోంది. అర్హులే కానీ వారి ఫోన్లకు వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు సందేశాలు వెళ్తున్నాయి. ప్రతీ జిల్లాల్లో వ్యాక్సినేషన్​ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. డోసులు పొందకపోయినా ఎందుకు.? ఇలా వచ్చిదంటూ సదరు వ్యక్తులు ఆరా తీస్తున్నారు. ఇలా […]

Update: 2021-10-17 11:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా టీకా తీసుకోకపోయినా, చాలా మందికి వ్యాక్సిన్ వేసుకున్నట్టు మెసేజ్‌లు వస్తున్నాయి. అంతేగాక డోసులు తీసుకున్నట్లు ఒకరి మెసేజ్‌లు మరొకరికి పంపుతున్నారు. మరోవైపు కేవలం తొలి డోసు తీసుకున్నా, రెండు డోసులు పూర్తి అయినట్టు సమాచారం వస్తోంది. అర్హులే కానీ వారి ఫోన్లకు వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు సందేశాలు వెళ్తున్నాయి.

ప్రతీ జిల్లాల్లో వ్యాక్సినేషన్​ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. డోసులు పొందకపోయినా ఎందుకు.? ఇలా వచ్చిదంటూ సదరు వ్యక్తులు ఆరా తీస్తున్నారు. ఇలా వస్తే తమకు మళ్లీ టీకా ఇస్తారో.? లేదోనని అనేక మంది టెన్షన్​పడుతున్నారు. స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లినా సరైన సమాధానం లభించడంలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక కొందరు వ్యక్తులు 104 కాల్​సెంటర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు.

ఎందుకు ఇలా జరుగుతున్నది..?

సాంకేతికపరమైన తప్పిదాలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు చెబుతుండగా, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటివి సంభవిస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. టీకా పంపిణీ కేంద్రాల్లో సరిగ్గా వివరాలు సేకరించకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు వివరిస్తున్నారు. దీంతో, టీకా పొందినట్లు ఒకరి సందేశాలు మరొకరికి వెళ్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు 100 శాతం వ్యాక్సినేషన్‌ను అనుకున్న టార్గెట్ లోపు పూర్తి చేయాలనే వేగంతో కూడా తప్పులు జరుగుతున్నాయని స్వయంగా అధికారులే ఆఫ్​ది రికార్డులో ఒప్పుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో సర్వర్ సమస్యతోనూ ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఇటువంటి సమస్యలు పరిష్కరించేందుకు మరో నాలుగైదు రోజుల్లో ప్రతీ జిల్లాలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

 

Tags:    

Similar News